జగజ్జేత భారత్‌ – ట్వంటీ 20 ప్రపంచ కప్‌

ట్వంటీ-20 ప్రపంచ కప్ ఫైనల్‌లో భారత్, పాక్‌పై 5 పరుగుల తేడాతో విజయం సాధించి కోట్లాది భారత క్రీడాభిమానులు హృదయాలు ఆనందంతో ఉప్పోంగిపోయేలా తొలి ట్వంటీ-20 ప్రపంచ కప్ గెలుచుకుంది.
ఎట్టకేలకు, à°šà°¿à°° కాలంగా ఊరిస్తున్న ప్రపంచ కప్ యువ హీరోల సమిష్టి కృషితో…. భారత్ వశమైంది.


భారత్-పాక్ మధ్యన మరో ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో భారత్ యువ హీరోలు, పాక్‌ని చివరి నిమిషంలో ఖంగు తినిపించి,అప్పటి దాకా దోబూచులాడుతున్న విజయాన్ని వరించి…ఎంతోకాలంగా భారత్‌ని ఊరిస్తున్న ప్రపంచ కప్ (ట్వంటీ-20) ని గెలవటంతో ఒక్కసారిగా భారత్ ఆటగాళ్ళలో ఒక్కసారిగా విజయానందంతో మైదానమంతా విజయవిహారం చేసారు.

ఎక్కడైతే పోగొట్టుకొనారో భారత్ ఆటగాళ్ళు అక్కడే గెలుచుకున్నారు. 2003 ప్రపంచ కప్ ఫైనల్‌లో ఇదే స్టేడియంలో భారత్ జట్టు ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయి ప్రపంచ కప్‌ని చేజార్చుకుంది.

భారత్-పాక్ మ్యాచ్ అంటేనే బహు రసవత్తరంగా ఉంటాది…అందులోను ప్రపంచ చాంపియన్‌షిప్ కోసం జరుగుతున్న ఫైనల్ మ్యాచ్. à°’à°• దశలో భారత్‌దే కప్ అనుకుంటున్న సమయంలో, పాకిస్తాన్ మెరుపు వీరుడు మిస్బా ఉల్ హక్ చెలరేగి 17à°µ ఓవర్‌లో వరుసగా మూడు సిక్సర్లతో విజయలక్ష్మిని తమ జట్టు వైపు నడిపించసాగాడు. చివరికి వికెట్లు ఏవి కూడా చేతిలో లేని సమయంలో హుక్ దూకుడుతో-పాక్ జట్టు విజయానికి కేవలం 6 పరుగుల చేరువకి వచ్చేసింది. ఇంకేముంది… ఉపఖండంలోని క్రీడాభిమానులలో ఒక్కసారిగా నరాలు తెగే ఉత్కంఠత.

ఇరుజట్ల మధ్య విజయం ఊగిసలాడుతుండగా …పాకిస్తాన్ ఆశా కిరణం ఉల్ హక్ – జోగీందర్ శర్మ వేసిన బంతిని సిక్సర్‌కి హుక్ చేయబోయి…డీప్ స్క్వేర్‌లో ఉన్న శ్రీకాంత్ చేతిలోకి ల్యాండ్ చేయటంతో.. కప్ భారత్ వశమైంది.

2 Responses to “జగజ్జేత భారత్‌ – ట్వంటీ 20 ప్రపంచ కప్‌”

  1. Vasu says:

    Good article. Minor correction though. Srishanth caught in fineleg and deep squre leg. Thanks

  2. థాంక్స్ à°…à°‚à°¡à°¿… నాకు నిజంగా క్రికెట్లో à°† టెర్మినాలజీ తెలీదు. స్నేహితుడిని అడిగితే… డీప్ స్క్వేర్ అన్నాడు…ఇక అలానే రాసాను.

Leave a Reply