1 2 3 కలిపితే కంత్రీ - సమీక్ష

1-2-3-%e0%b0%95%e0%b0%b2%e0%b0%bf%e0%b0%aa%e0%b0%bf%e0%b0%a4%e0%b1%87-%e0%b0%95%e0%b0%82%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0%e0%b1%80-%e0%b0%b8%e0%b0%ae%e0%b1%80%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7

తారాగణం:జూ ఎన్టీయార్, హన్సికా మోత్వానీ,తనీషా (స్త్రీ లింగం), ప్రకాష్ రాజ్ , ఆశిష్ విద్యార్ధి,, షియాజీ షిండే, ముఖేష్ రుషి, సుబ్బ రాజు, కోట శ్రీనివాసరావు, ఆహుతి ప్రసాద్, బ్రహ్మాజీ, రాజా , జయప్రకాష్ రెడ్డీ , పింగ్ పాంగ్  
 
హాస్య నట వర్గం: రఘు బాబు, సునీల్, ఆలీ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, కృష్ణ భగవాన్,బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ,
నిర్మాత: అశ్వినీ దత్ ( 30 ఇయర్స్ ఇండస్ట్రీ)
కధ, మాటలు, స్క్రీన్ ప్లే - దర్శకత్వం - మెహర్ రమేష్
సుత్తి లేకుండా…సూటిగా […]

⇥ Read the article in full

About

నేను చూస్తున్న లోకం

Read More   ⎋

Subscribe to RSS Feed

Archives

Recent articles

యుద్దం - రోజుకు రెండుసార్లు

హైద్రాబాద్ ట్రాఫిక్
యుధ్దం ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా….??? నాకు తెలుసు…!!! యుద్దం ఆంటే..హైద్రాబాద్ ట్రాఫిక్ అంత భయంకరంగా ఉంటుంది. ఒక సారి మొదలెట్టామా…ఇక ఆపడానికి ఉండదు. అంటే..రయ్యి రయ్యి మని సాగిపోవచ్చు…ఆగేది ఉండదు అని కాదు. నీకు విసుగు పుట్టి…బండి వదిలేసి..వెళ్ళిపోదామన్నా కుదరదు అని…అన్న మాట!!

⇥ Continue reading

తిరంగా రన్ @ విజయవాడ

thiranga run @ vijayawada

హైదరాబాదు తెలుగు బ్లాగరుల సమావేశం - అక్టోబర్ 14

మొదటిసారి హైదరాబాదు తెలుగు బ్లాగరుల సమావేశానికి వెళ్ళాను. అక్టోబర్ 14న, హైదరాబాదులో యూసఫ్‌గూడ కృష్ణకాంత్ పార్క్.

మరి ఈ రోజు తారీఖు - అక్టోబర్ 25, అప్పుడెప్పుడో బ్లాగరుల మీటింగ్‌కి వెళ్తే… ఇప్పుడు రాస్తున్నానేంటి???  ఏమి చేయను. అప్పటి నుంచి హైదరాబాదులోనే ఉన్నాను. ఇప్పుడే విజయవాడ వచ్చాను.

ఇక విషయానికి వొస్తే…. ఈ మధ్య కాలంలో నేను చేసిన మంచి పనులలో ఇది ఒకటి. : తెలుగు బ్లాగరుల మీటింగ్‌కి వెళ్ళటం.

తెలుగు బ్లాగరులు

⇥ Continue reading

Blogging from mobile

Posted by mobile phone:
Yum! blogging from my mobile. thanks to nokia, vodafone, wordpress people.

నాకు నేను ట్యాగులు తగిలించుకుంటే

రాజు సైకం, తెలుగు బ్లాగు, తెలుగు, విజయవాడ, ముద్ర -డిగ్ తెలుగు బ్లాగులు,

చిరుత - చిరు తనయుడే!! : ఒక రివ్యూ

%e0%b0%9a%e0%b0%bf%e0%b0%b0%e0%b1%81%e0%b0%a4-%e0%b0%9a%e0%b0%bf%e0%b0%b0%e0%b1%81-%e0%b0%a4%e0%b0%a8%e0%b0%af%e0%b1%81%e0%b0%a1%e0%b1%87-%e0%b0%92%e0%b0%95-%e0%b0%b0%e0%b0%bf%e0%b0%b5%e0%b1%8d

మ్మ్… చిరంజీవి సిన్మా అంటే మొదటి రోజే చూడాలి… కాలేజి రోజుల్లో ఉదయాన్నే…ఆరింటికి బెనిఫిట్ షో చూసేవాళ్ళం. ఇప్పుడు ఆఫీస్ కి వెళ్ళి…ఒక సారి ఆఫీస్‌లో కనిపించి ..ఇక చిరుతని కలవటానికి వెళ్ళి ఇదుగో ఇప్పుడే వచ్చాను.

ఇక సిన్మా విషయానికి వస్తే… ఎవరు ఈ సిన్మా కి వెళ్ళినా…ఛిరంజీవి నట వారసుడి సిన్మా కాబట్టి. సో రామ్ చరణ్ విషయానికి వస్తే..

ప్రతి అభిమాని ఆశించిన విధంగానే.. డాన్సులు చాలా బాగా చేసాడు. యాక్షన్ సన్నివేశాలు కూడా చాలా ఈజ్‌తో చేసాడు. ఎవరి కొడుకు మరీ…

మొదటి సినిమా కదా…అని చూస్తే…చిరుత బాగానే కనిపించాడు. బాగానే అలరించాడు.

చిరంజీవి కొడుకు లెక్కన చూడాలంటే.. వాయిస్ బాగున్నా…కొన్ని చోట్ల డైలాగ్ డెలివరీ అంతగా నప్పలేదు. కొన్ని చోట్ల డీగ్లామరస్డ్ కూడా ఉన్నాడు.అదే సమయంలో సిన్మాలో అధిక సమయం…చాలా అందంగా కనిపించాడు.

⇥ Continue reading

గూగిల్ కి 9వ జన్మదిన శుభాకాంక్షలు

%e0%b0%97%e0%b1%82%e0%b0%97%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8d-%e0%b0%95%e0%b0%bf-9%e0%b0%b5-%e0%b0%9c%e0%b0%a8%e0%b1%8d%e0%b0%ae%e0%b0%a6%e0%b0%bf%e0%b0%a8-%e0%b0%b6%e0%b1%81%e0%b0%ad%e0%b0%be%e0%b0%95

గూగిల్ కి 9వ జన్మదిన శుభాకాంక్షలు

ఎన్70 ఎమ్ కొనుకున్నానోచ్!!!

%e0%b0%8e%e0%b0%a8%e0%b1%8d70-%e0%b0%8e%e0%b0%ae%e0%b1%8d-%e0%b0%95%e0%b1%8a%e0%b0%a8%e0%b1%81%e0%b0%95%e0%b1%81%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b0%be%e0%b0%a8%e0%b1%8b%e0%b0%9a%e0%b1%8d

ఎన్నో రోజులుగా మంచి ఫోన్ కొనుక్కోవాలన్న కోరిక నిన్న రాత్రి ‘ఎన్70 ఎమ్’ తో తీరింది. మొత్తానిని నేను కూడా ‘ఎన్‌ సిరీస్‌’ అయ్యాను.

Now I am N Series

2 మెగా పిక్సెల్‌ కేమేరా ఉందిగా… ఇక ప్రపంచం అంతా నా మొబైల్‌ కెమేరా కన్నుతోనే చూస్తానేమో! … 1 జిబి మెమరీ ఉంది… ఇంకేంటి… ఇక నేను కూడా…ఫ్లిక్కర్‌లో ఉంటానోచ్‌…

ఇక GPRS యాక్టివేట్ అయితే… నా మొబైల్‌ నుంచి ఇక్కడికి ఒక బ్లాగు టపా పోస్ట్‌ చేయాలి.

అవునూ!!, ఇందులో తెలుగు ఫాంట్ కనిపిస్తుందా?????

జగజ్జేత భారత్‌ - ట్వంటీ 20 ప్రపంచ కప్‌

%e0%b0%9c%e0%b0%97%e0%b0%9c%e0%b1%8d%e0%b0%9c%e0%b1%87%e0%b0%a4-%e0%b0%ad%e0%b0%be%e0%b0%b0%e0%b0%a4%e0%b1%8d%e2%80%8c-%e0%b0%9f%e0%b1%8d%e0%b0%b5%e0%b0%82%e0%b0%9f%e0%b1%80-20-%e0%b0%aa%e0%b1%8d

ట్వంటీ-20 ప్రపంచ కప్ ఫైనల్‌లో భారత్, పాక్‌పై 5 పరుగుల తేడాతో విజయం సాధించి కోట్లాది భారత క్రీడాభిమానులు హృదయాలు ఆనందంతో ఉప్పోంగిపోయేలా తొలి ట్వంటీ-20 ప్రపంచ కప్ గెలుచుకుంది.
ఎట్టకేలకు, చిర కాలంగా ఊరిస్తున్న ప్రపంచ కప్ యువ హీరోల సమిష్టి కృషితో…. భారత్ వశమైంది.


భారత్-పాక్ మధ్యన మరో ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో భారత్ యువ హీరోలు, పాక్‌ని చివరి నిమిషంలో ఖంగు తినిపించి,అప్పటి దాకా దోబూచులాడుతున్న విజయాన్ని వరించి…ఎంతోకాలంగా భారత్‌ని ఊరిస్తున్న ప్రపంచ కప్ (ట్వంటీ-20) ని గెలవటంతో ఒక్కసారిగా భారత్ ఆటగాళ్ళలో ఒక్కసారిగా విజయానందంతో మైదానమంతా విజయవిహారం చేసారు.

ఎక్కడైతే పోగొట్టుకొనారో భారత్ ఆటగాళ్ళు అక్కడే గెలుచుకున్నారు. 2003 ప్రపంచ కప్ ఫైనల్‌లో ఇదే స్టేడియంలో భారత్ జట్టు ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయి ప్రపంచ కప్‌ని చేజార్చుకుంది.

⇥ Continue reading

ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు @ విజయవాడ

ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు, విజయవాడలో ఈ రోజు ప్రారంభమయ్యాయి. విజయవాడలోని బందర్‌ రోడ్డు ఆనుకుని ఉన్న శేషసాయి కళ్యాణ మంటపంలో ఈ సభలను రాష్ట్ర గవర్నర్‌ నారయణదత్ తివారి ప్రారంభించారు.

ఈ మహాసభలు ఈరోజు నుంచి మూడు రోజుల (సెప్టెంబర్ 21,22 & 23)పాటు జరుగుతాయి.

ఈ సభలను కృష్ణా జిల్లా రచయితల గౌరవ సంఘం అధ్యక్షుడు మండలి బుద్ధ ప్రసాద్ (రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి) పర్యవేక్షిస్తారు.

భారత స్వాతంత్రోద్యమ వజ్రోత్సవాలను పురస్కరించుకుని జరుపుతున్న ఈ మహా సభలకు సుమారు వెయ్యి మంది వరకు రచయితలు పాల్గొంటున్నట్లు నిర్వాహకులు చెపుతున్నారు.

తెలుగు బ్లాగరులు ఎవరైనా వీటికి హాజరు అవుతున్నారా? ఎవరైనా విజయవాడ వస్తుంటే.. నాకు తెలియచేయండి. కలవగలము.

చిక్కిపోతున్న కిలోగ్రామ్‌ మాతృక

ప్రతి కొలతకు ఒక ప్రామాణికమైన మాతృక ఉంటుంది. మనం నిత్యం ఉపయోగించే ‘కిలోగ్రామ్‌’ కి కూడా ఒక మాతృక ( Reference prototype ) ఉంది. 118 సంవత్సరాల క్రితం మెట్రిక్‌ పద్దతి ఆదారంగా ఈ మాతృకని తయారు చేసారు.ఇంటర్నేషనల్‌ బ్యూరో ఆఫ్ వెయిట్స్ అండ్‌ మెజర్స్: ఐబిడబ్ల్యుఎమ్ ( International Bureau of Weights and Measures - IBWM) వారు,

చిక్కిపోతున్న కిలోగ్రామ్‌ మాతృక

గాలి వెలుతురు ఏ మాత్రం చొరబడలేని ఒక గదిలో, ఒక సిలిండర్‌లో ఈ మాతృకని భద్రపరిచారు. Sevres(paris) లో ఉన్న ఈ మాతృక బరువు క్రమంగా తగ్గుతుందని దానిని పర్యవేక్షిస్తున్న భౌతిక శాస్త్రవేత్త (Physicist) Richard Davis చెబుతున్నారు. పారిస్‌లో ఉన్న ఈ మాతృకని మాత్రమే ‘ప్రపంచ ప్రమాణికమైన మాతృక‌’గా పరిగణిస్తారు.
⇥ Continue reading

చిరుత: లో-ప్రొఫైల్‌ మంచిదేనా???

%e0%b0%9a%e0%b0%bf%e0%b0%b0%e0%b1%81%e0%b0%a4-%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b1%8a%e0%b0%ab%e0%b1%88%e0%b0%b2%e0%b1%8d%e2%80%8c-%e0%b0%ae%e0%b0%82%e0%b0%9a%e0%b0%bf%e0%b0%a6

నిన్నటి వరకు ఎగిరాను…మా చిరంజీవి కొడుకు సినిమా వస్తుందని….
కాని ఇప్పుడేంటి…. ఇలా కంగారుగా ఉంది.

నిజమే!!… కంగారుగానే ఉంది. సినిమా రిలీజ్‌కి ఇంకా 9 రోజులే ఉంది.

  • ఇప్పటి వరకు ఒక ట్రైలర్‌ లేదు.
  • ఒక ప్రెస్‌ మీటింగ్‌ లేదు.
  • ఒక పబ్లిక్‌ ఫంక్షన్‌ లేదు.
  • ఆడియో ఫంక్షన్‌ లేదు..
  • ప్లాటినం డిస్క్‌ ఫంక్షన్‌ లేదు.
  • వెబ్‌లో ఫ్యాన్స్‌కి తప్ప మిగిలిన వారికి ( చా..లా.. మందికి ) రిలీజ్‌ డేట్‌ కూడా తెలియదు.

⇥ Continue reading

యాహూ! మాష్ - యాహూ నుంచి సోషల్‌ నెట్‌వర్కింగ్ సైట్‌

raju sykam on yahoo mash

మొత్తానికి యాహూ! కూడా యహూ! మాష్ తో సోషల్‌ నెట్‌వర్కింగ్ రంగంలోకి దిగింది. నా మటుకు నాకు మొదటి లుక్కులోనే చాలా బాగా నచ్చింది.

ఆర్కట్, మై స్పేస్ (నా జాగా), ఫేస్‌ బుక్‌ (ముఖ పుస్తకం) {ఇలాంటి అనువాదాలు నాకు ఎందుకో పూర్తిగా నప్పవు!} లాగా ఇది కూడా త్వరలోనే..పెద్ద బాక్సాఫీస్ హిట్టవుతుంది అని అనిపిస్తుంది.

ఇది పలు మాడ్యూల్స్ తో చేయబడింది. అంటే.. వర్డ్ ప్రెస్‌ లో ప్లగ్గిన్స్‌లా అన్నమాట. ప్రాధమికం గా, మనం మన ప్రొఫైల్‌ క్రియేట్‌ చేసుకున్నప్పుడు… మనకు ఈ మాడ్యూల్స్ తో లబిస్తుంది.

  • Flickr RSS
  • Ego Boost
  • Common Friends
  • My MashLog ( Log Record of profile/Mash )
  • Blog Module ( RSS 20 ) ( మన బ్లాగు ఫీడ్‌ని ఇక్కడ ప్రదర్శించుకోవచ్చు ;) పైన ఫొటోలో కుడి వైపు క్రింది భాగంలో నా తెలుగు బ్లాగు టపాలు చూడొచ్చు.! )

⇥ Continue reading

నన్ను వదిలిపోని నా స్నేహితుడు - వీడిని ఎలా వదిలించుకోవటం -2

హమ్మయ్యా!! మొత్తానికి నా (లాప్‌-టాప్)Laptop నా దగ్గరికి వచ్చింది. ఇక నా స్నేహితుడి గురించి చెప్పవచ్చు. ఈ సారి వాడి మీద నాదే పై చేయి. వూకదంపుడు గారికి నా స్నేహితుడితో బాగా పరిచయం అని చెప్పారు.
⇥ Continue reading

సోమర్ సెట్ మామ్ రాయని కధ - బుచ్చిబాబు రాస్తే!!

లాప్ టాప్ కాస్తా లేకపోయేసరికి, చివరికి నిన్న రాత్రి బుచ్చిబాబు గారి కధల పుస్తకం నాకు కొంచెం కంపెనీ ఇచ్చింది.

రాత్రి చదివిన రెండు కధలు..

  1. మామ్ రాయని కధ
  2. మధుర క్షణం

ఇక ‘ మామ్ రాయని కధ ‘ కి వస్తే… ఇది ఇద్దరు యువ సహోద్యోగుల కధ. ఒకరు రవి కిరణ్, రెండో వ్యక్తి చంద్ర శేఖరం. ఇద్దరూ ఒక అటవీ ప్రాంతంలో రోడ్డు వేసే పని మీద తమ సొంత మనుష్యులకి, వూరికి దూరంగా ఉండవలసి వస్తుంది. ఇందులో చంద్ర శేఖరం కి ఎప్పుడూ చాలా ఉత్తరాలు వస్తూ ఉంటాయి. రవి కి ఒక్కరూ ఒక్క ఉత్తరం కూడా రాయరు. ఈ విషయమై రవి చాలా భాద పడతాడు. అతనిని వోదార్చటానికి సరదాగా చంద్ర శేఖరం తనకొచ్చిన ఉత్తరాల్లో నుంచి ఒక దానిని తీసుకోమంటాడు. (కొనుక్కోమంటాడు). ఉత్తరం మీద ఆశతో రవి వెంటనే శేఖరం కొచ్చిన ఉత్తరాల్లోంచి ఒక కవర్ తీసుకుని బదులుగా పది రూపాయలు ఇస్తాడు.      

⇥ Continue reading

నన్ను వదిలిపోని నా స్నేహితుడు - వీడిని ఎలా వదిలించుకోవటం ?

వీడి బొంద బడా?? ఎప్పుడో చిన్నప్పుడు తగిలాడు… తూనీగ ఫ్రెండ్ అన్న మాట.. స్కూల్ లైఫ్ అంతా నాతోనే ఉన్నాడు. అసలు ఎప్పుడు ఏ పని మొదలుపెడదామన్నా వీడు మొదలుపెట్టనివ్వడే??!!!  సరే.. ఆ వయసులో వీడి వల్ల నాకు అంత డేంజర్ ఏమి కనబడలేదు. నా మీద వాడిది  ఎప్పుడూ అప్పర్ హ్యాండే!!..సరే లే. చిన్నప్పుడు అందరికీ అలాంటి  ఫ్రెండ్ ఒకడు ఉంటాడులే అని సరిపెట్టుకున్నా..

మొత్తానికి 10వ తరగతి పూర్తి అయ్యింది..మా కుటుంబం మొత్తం అందరం హైద్రాబాద్ వెళ్ళిపోయాము.
హమ్మయా((( !!!

తప్పించుకున్నాను…

⇥ Continue reading

ముద్ర-తెలుగు బ్లాగు టపాలకు ముద్ర చేయండి

ఎట్టకేలకు ముద్ర - సంతృప్తికరంగా పూర్తి అయ్యింది. తెలుగు బ్లాగులకు డిగ్ లాంటి వెబ్‌సైట్ ఉండాలని వచ్చిన ఒక ఆలోచన ఈ రోజుకి ఒక రూపం దాల్చింది.

మీ అందరికి డిగ్ తెలుసు కదా.. ముద్ర కూడా అటువంటి సైటే..

తెలుగు బ్లాగులలోని టపాలకు బ్లాగు పాఠకులు, తమకు నచ్చిన టపాలకు వోటు ( ముద్ర ) వేస్తే.. అటువంటి టపాలన్ని ఒక చోట చూడగలిగితే … అదే ముద్ర..

⇥ Continue reading

ఆంధ్రజ్యోతి ఈ-పేపర్ డొమైన్ ఎక్స్‌పైర్డ్ ????

ఆంధ్రజ్యోతి ఈ-పేపర్ డొమైన్ ఎక్స్‌పైర్ అయ్యిందే!!! అయ్యో పాపం …

సబ్ డొమైన్ ఎక్స్‌పైర్ అవ్వటం ఏమిటో???